← Back to news

రోడ్డుపై పడిన నెయ్యి.. ఎగబడిన జనం

By Krishna· 3h ago· Instagram

ఉత్తరప్రదేశ్‌.. మురాదాబాద్‌లో.. ఢిల్లీ-లక్నో హైవేపై నెయ్యి పడింది. నెయ్యిని తీసుకెళ్తున్న ట్యాంకర్.. ఓ వ్యక్తిని తప్పించబోయి, కంట్రోల్ కోల్పోయి, డివైడర్‌ను దాటి పల్టీ కొట్టింది. ట్యాంకర్ నుంచి పెద్ద మొత్తంలో నెయ్యి రోడ్డుపై చాలా మీటర్ల వరకు చిందింది. స్థానికులు పరుగున వచ్చి బకెట్లు, డబ్బాలతో నెయ్యిని తీసుకోవడం ప్రారంభించారు. ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోలీసులు జనాన్ని చెదరగొట్టి, క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను నిలబెట్టి, రోడ్డును క్లియర్ చేశారు.

More in Viral