ఓటర్లా? ఆత్మలా?

కర్ణాటక.. బాగల్‌కోట్ S.I.R ప్రక్రియలో విచిత్రమైన విషయం బయటపడింది. విరమ్మ చనిపోయినట్లు జూన్ 11న ఫారం-10లో మల్లికార్జున్ చెప్పగా.. మర్నాడు.. మల్లికార్జున్ చనిపోయినట్లుగా విరమ్మ ఫారం-10లో తెలిపారు. ఇద్దరిదీ ఒకే బూత్. ఇద్దరూ బతికే ఉన్నారనుకుంటే.. చనిపోయినట్లుగా ఫారం-10లు ఉండటం కలకలం రేపింది. అల్ట్‌న్యూస్ కో-ఫౌండర్ మహ్మద్ జుబైర్ ఇలాంటి 334 జంటలు ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలో 16 లక్షలకు పైగా ఓటర్లను ‘మరణించినట్లు’గా గుర్తించారు. అందుకే S.I.R ప్రక్రియపై ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి.


