← Back to news

డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

By epuri rajaratnam· 4d ago
డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

AP: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రెయిన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. మార్కండేయ కాలనీలోని టిడ్కో ప్రాంతంలో డ్రెయిన్లను పరిశీలించిన ఆయన కాజా ఈస్ట్ లేక్ వాకింగ్ ట్రాక్, బాప్టిస్ట్‌పేటకు అనుసంధానమైన డ్రెయిన్‌ను ఇంజినీరింగ్, ఉద్యానవన విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కండేయ కాలనీ టిడ్కో వద్ద డ్రెయిన్ల పరిస్థితి, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కమిషనర్ నీటి పారుదల సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

More in Local