← Back to news

గురజాలలో ఓటర్ల జాబితా విడుదల..!

By SUBHANI· 14h ago
గురజాలలో ఓటర్ల జాబితా విడుదల..!

ఇది విన్నారా? పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఓటర్ల జాబితా సిద్ధమైంది. 23 వార్డుల ఫోటో ఎలక్టోరల్ రోల్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2026 జనవరి 1ని ప్రామాణిక తేదీగా తీసుకున్నారు. ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, ఎంపీపీ కార్యాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉన్నాయి. ఓటర్లు వెళ్లి తమ పేర్లు చెక్ చేసుకోవాలి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.