లింగారెడ్డిగూడెంలో స్మార్ట్ కార్డుల పంపిణీ

TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడెంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్వహించారు. పేదల ఆకలి తీర్చేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఇప్పుడు స్మార్ట్ కార్డుల ద్వారా మరో అడుగు ముందుకు వేసిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్మార్ట్ కార్డుల ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, గ్రామ సర్పంచ్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.



