← Back to news

17 రోజులుగా రాంచీలో విద్యార్థుల ఆందోళనలు

By విశీ· 10 Aug 2026· X

రాంచీలో ఝార్ఖండ్ విధానసభ బయట JPSC-JSSC అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు. JSSC-CGL పరీక్షలో అక్రమాలపై స్వతంత్ర CBI విచారణ చేయాలని, JPSC, JSSC రెండింటిలోనూ మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు 17 రోజులుగా సాగుతున్నాయి. 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రీలిమ్స్, JSSC-CGL, ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్‌లు, OMR షీట్ల లీక్ జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ప్యానెల్ ద్వారా స్వతంత్ర విచారణ చేయాలని కోరుతున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 11h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.