పిల్లల మధ్య జ్యోతిక-సూర్య మళ్లీ పెళ్లి

సూర్య-జ్యోతిక కపుల్ 20 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మళ్లీ పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. చర్చిలో క్రిస్టియన్ ట్రెడిషన్‌లో జరిగిన ఈ వో వీన్యూవల్ వేడుకలో వారి పిల్లలు దేవ్, దియా ప్రత్యేక సాక్షులుగా పాల్గొన్నారు. జ్యోతిక తెల్లని గౌనులో.. కొడుకు దేవ్ చేతిని పట్టుకుని వచ్చినప్పుడు సూర్య కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్తితో సహా కుటుంబం, ఫ్రెండ్స్ హాజరయ్యారు. జ్యోతిక ఇన్‌స్టాలో ‘ది సీక్వెల్’ అనే పేరుతో వీడియోని షేర్ చేశారు.


