← Back to news

ప్రజావాణి ఘనం.. పరిష్కారాలే శూన్యం

By Prashanth· 1h ago
ప్రజావాణి ఘనం.. పరిష్కారాలే శూన్యం

TG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి ఎంతో కీలకమైనదని అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవంగా మాత్రం కొన్నిచోట్ల ప్రజావాణికి కనీస రెస్పాన్స్ రావడం లేదు. సోమవారం హైదరాబాద్ నగరం చంద్రాయణగుట్ట పరిధిలోని నఖ్వీ ఫూల్ బాగ్ జోనల్ కమిషనర్‌ కార్యాలయంలో ప్రజావాణి ఏర్పాటు చేశారు. అయితే ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ప్రజలకు ప్రజావాణిపై అవగాహన లేకపోవడమా, గతంలో చేసిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడమే కారణమా అనేది అధికారులే తేల్చాలి.

More in Current Affairs