← Back to news

ఒడిశా కేడర్‌ ఐపీఎస్..హైదరాబాద్‌లో కన్నుమూత

By Vishi· 4d ago
ఒడిశా కేడర్‌ ఐపీఎస్..హైదరాబాద్‌లో కన్నుమూత

ఒడిశా కేడర్‌కు చెందిన కేరళం ఐపీఎస్ అధికారి షఫీన్ అహ్మద్.కె(50) క్యాన్సర్‌తో మరణించారు. 2003 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన షఫీన్ సీఐటీయూ నాయకుడు హబీబ్ కుమారుడు. ఒడిశాలో క్రైమ్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ ఐజీగా పనిచేస్తున్నారు. కేరళంలో డిప్యుటేషన్‌పై తిరువనంతపురం రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్‌గా కూడా ఉన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడే కన్నుమూశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.