← Back to news

80 లక్షలు దాటిన HPV ఉచిత టీకాల సంఖ్య

By Lokesh· 54m ago
80 లక్షలు దాటిన HPV ఉచిత టీకాల సంఖ్య

దేశంలో 14 ఏళ్ల బాలికలకు ఇస్తున్న ఉచిత HPV టీకా 80 లక్షల డోసులను దాటింది. ఈ టీకా వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 2026 ఫిబ్రవరి 28న అజ్మీర్‌లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రుల అనుమతితో బాలికలకు టీకా ఇస్తారు. ఈ టీకా ఉచితమే. టీకా తీసుకోవడం పూర్తిగా వారి ఇష్టమే. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా బాలికలు టీకా తీసుకున్నారు.

More in National