← Back to news

లైఫ్ జాకెట్స్ లేవు.. షాకింగ్ జర్నీ వీడియో!

By Krishna· 1d ago· X

బీహార్, భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్ గంగా ఘాట్ దగ్గర అత్యంత ఆందోళనకరమైన దృశ్యం కనిపించింది. ఇక్కడ నదిపై బోటులో ప్రయాణిస్తున్న వారిలో ఏ ఒక్కరూ లైఫ్ జాకెట్ ధరించలేదు. కనీసం పడవ నిర్వాహకులు వారికి వాటిని అందించలేదు. పడవ అదుపుతప్పి బోల్తా పడినా లేదా ఎవరైనా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినా, ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైన కనీస రక్షణ లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

More in National