నాకు టికెట్ ఇచ్చింది AICC.. రాజ్‌గోపాల్ కాదు

TG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి MLA మందుల సామెల్ తీవ్రంగా స్పందించారు. తనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది AICC అని, రాజ్‌గోపాల్‌రెడ్డి కాదని స్పష్టం చేశారు. తాను రాజ్‌గోపాల్‌రెడ్డి కంటే ముందే కాంగ్రెస్‌లో చేరానని గుర్తుచేశారు. తన గెలుపుకు అన్ని వర్గాల ప్రజలే కారణమని, కేవలం ఒకే వర్గంతో రాజకీయాలు నడవవని అన్నారు. మునుగోడులో రాజ్‌గోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు తన క్యాడర్ కూడా పనిచేసిందని, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని చెప్పారు.



