బస్తీ దవాఖానాలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బస్తీ దవాఖానాను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ తనిఖీ చేశారు. దవాఖానాలో మందుల నిల్వను పరిశీలించడంతో పాటు ఓపీడీ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. దవాఖానాలో వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.



