జర్నలిస్టుల సమస్యలపై బిగ్ డిమాండ్.. RDOకు వినతి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్యులు సేవలు అందించారు. సన్‌రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో ఎం.వి. రమణకు వినతిపత్రం అందజేశారు.





