షార్ట్స్ వేసుకున్నారని టూరిస్టులను కొట్టారా? 😳

పుణేలోని సింహగఢ్ కోటకు వెళ్లిన నలుగురు టూరిస్టులను వారు షార్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకున్నారనే కారణంతో కొందరు అడ్డుకుని కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నలుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. “షార్ట్స్ ఎందుకు వేసుకున్నారు?” అంటూ ప్రశ్నించి, చెంపదెబ్బలు కొట్టినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనపై ఎనిమిది మందిపై కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు చర్చ డ్రెస్ కోడ్ గురించే కాదు.. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరి దుస్తులు నచ్చలేదని వారిపై దాడి చేసే హక్కు ఎవరికైనా ఉందా? అనే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.



