కుట్టు మిషన్ కోసం అప్లై చేసుకున్నారా?

TG: తెలంగాణలో BC Co-operative Finance Corporation ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకానికి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. కుట్టు మిషన్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అర్హులైన మహిళలు <a href="https://tgobmms.cgg.gov.in/">వెబ్‌సైట్</a> ద్వారా అప్లై చేసుకోవాలి. 2026–27 సంవత్సరానికి సంబంధించిన ఈ పథకానికి రేపటితో అప్లికేషన్ గడువు ముగుస్తుంది. అర్హత ఉన్న మహిళలు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


