← Back to news

నేతల మధ్య వివాదంతో ఆగిన రేషన్ కార్డుల పంపిణీ

By DK· 1d ago
నేతల మధ్య వివాదంతో ఆగిన రేషన్ కార్డుల పంపిణీ

TG: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. తహసీల్దార్ భిక్షపతి అధికారులతో కలిసి కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్‌కు ముందే సమాచారం ఇచ్చారు. కార్డుల పంపిణీ సమయంలో తామే పంపిణీ చేస్తామంటూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేశారు. సర్పంచ్ గుల్లపల్లి లక్ష్మి, పాలకవర్గ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

More in TG