← Back to news

ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు

By dk· 13 Aug 2026· కృష్ణా జిల్లా
ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు

AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ ద్వారా బ్యూటిషియన్‌ను వేధిస్తున్న ఫోటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, అందులో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దాసరి రామకృష్ణ అనే ఫోటోగ్రాఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 6h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.