మిల్క్ పౌడర్లు తాగితే ఎత్తు పెరుగుతారా?
పిల్లల హైట్ పెంచుతాయని ప్రచారం చేసే మిల్క్ పౌడర్లు, గమ్మీల వెనుక ఉన్న నిజాలను డాక్టర్ శివరంజని సంతోష్ మాటల్లో. పిల్లల హైట్ జీన్స్, న్యూట్రిషన్, హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది తప్ప ఇటువంటి సప్లిమెంట్లతో ఎక్స్ట్రా హైట్ పెరగరని స్పష్టం చేశారు. బాడీలో న్యూట్రిషన్ లోపం ఉన్నప్పుడే ఇవి సపోర్ట్ చేస్తాయి. సోషల్ మీడియాలో హైట్ బూస్టర్స్ అని నమ్మించే ఇన్‌ఫ్లుయెన్సర్లను నమ్మొద్దని హెచ్చరించారు. గ్రోత్ తక్కువగా ఉంటే పీడియాట్రీషియన్‌ని కన్సల్ట్ అయి బోన్ ఏజ్ ఎక్స్‌రే, బ్లడ్ టెస్ట్‌లు చేయించడం బెటర్ అని చెప్పారు.



