మీ PFను ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు

దేశవ్యాప్తంగా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఇందులో రూ.9,330 కోట్లు ఇన్ ఆపరేటివ్‌గా పీఎఫ్ అకౌంట్లలోనే ఉందని తేలింది. ఆన్‌లైన్ ద్వారా ఇన్ ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలో డబ్బును పొందేందుకు ముందుగా మెంబర్ ఐడీ, పీఎఫ్ అకౌంట్ నంబర్ UAN వివరాలు అందించాలి. తరువాత EPFO పోర్టల్ లోకి వెళ్లి ఫామ్-19, ఫామ్-10Cను సమర్పించాలి. ఒకవేళ అకౌంట్ ఏడు సంవత్సరాలు ఇన్ ఆపరేటివ్‌గా ఉంటే మరిన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. UAN లాగిన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి, తరువాత క్లెయిమ్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేయాలి.



