← Back to news

ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

By DK· 1h ago
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. వడ్డీవాడ, అంట్లవరం, వడ్డీతాండ్రా, సంతబొమ్మాళి సహా గోదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మారువాడ, మేఘవరం ప్రాంతాల్లో పర్యటించారు. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

More in Local