← Back to news

సముద్రం మధ్యలో హంటా వైరస్ కలకలం..ఆ క్రూయిజ్ లు ఇద్దరు ఇండియన్స్

By aravinda nyayapati· 8 May 2026· Praia
సముద్రం మధ్యలో హంటా వైరస్ కలకలం..ఆ క్రూయిజ్ లు ఇద్దరు ఇండియన్స్

అర్జెంటీనా నుంచి బయలుదేరిన MV హోండియస్ అనే క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 8 మందికి ఈ వైరస్ సోకగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈసారి 'ఆండీస్ వైరస్' రకం వల్ల మనుషుల నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని WHO ఆందోళనగా ఉంది. ఆ షిప్ లో 149 మంది ప్రయాణికులుంటే అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ఈ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ప్రపంచదేశాలకు ముప్పు అంతగా లేకపోయినా అందరూ జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

More in Health