బతికున్న మహిళ చనిపోయిందని..గదికి తాళం వేసిన పోలీసులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతరా జిల్లాలోని పరుశురామ్ చౌక్‌లో ఉరి వేసుకున్న మహిళను చూసిన పోలీసులు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆమె మరణించినట్లు భావించారు. ఆ తర్వాత గదిలోకి మరెవరూ వెళ్లకుండా తాళం వేశారు. పంచనామా కోసం తలుపులు తెరవగా ఆ మహిళలో కదలికలు కనిపించాయి. ఆమె ఇంకా బతికే ఉందని గమనించిన కుటుంబసభ్యులు ఉరితాడు నుంచి కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.


