పక్కింటి వ్యక్తిపై ‘దయ్యాల కథల’తో ఊహించని రివెంజ్!

చైనాలోని గ్వాంజూలో ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటున్నారు. వారికి తమ పొరుగింటి వాళ్ళతో గొడవ జెరిగింది. అయితే ఆ పొరుగింటి వాళ్ళ మీద ప్రతీకారం ఇలా తీర్చుకున్నారు. గోడ పక్కన స్పీకర్లు పెట్టి రోజంతా భయంకరమైన దయ్యాల కథలను వినిపిస్తూ చుక్కలు చూపించారు. సౌండ్ లిమిట్లోనే ఉండటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆ స్పీకర్లను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అధికారుల సమక్షంలో స్పీకర్లను తొలగించారు.



