← Back to news

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

By KUCHIPUDI BUJJIBABU· 1d ago
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

AP: గుంటూరు జిల్లా మంగళగిరి బ్యాంక్‌ కాలనీలోని ANTMC యూపీ స్కూల్‌లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బొగి వినోద్‌ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎండీ ఆరిఫ్‌, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి బుల్లా కోటి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎండీ ఇబ్రహీం, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విన్నకోట శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.