PRCని వెంటనే ప్రకటించాలి: TGEJAC

TG: ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగ నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల బకాయిలను నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.

