ANUలో జర్నలిజం అలుమ్ని సందడి!

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో జర్నలిజం పూర్వ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. 2003లో ఈ కోర్సు మొదలైంది. ఇప్పుడు చాలామంది పెద్ద మీడియా హౌస్‌ల్లో పనిచేస్తున్నారు. పూర్వ విద్యార్థులు ఉద్వేగంగా మాట్లాడుతూ.. విలువలతో కూడిన జర్నలిజం ఎంతో అవసరమని అన్నారు. డిపార్ట్మెంట్ హెడ్ జ్యోతిర్మయి డిజిటల్ జర్నలిజంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ హెచ్వోడీలు సి.నారాయణరావు, ప్రొ.సుబ్రహ్మణ్యం, ప్రొ.శామ్యూల్, ప్రొ.మాణిక్యరావు పాల్గొన్నారు.





