చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడు హల్‌చల్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 12రోజులు దాటినా ఆచూకీ దొరకలేదు. గురువారం తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు. తాను జ్ఞానిని అని చెప్పుకుంటూ, పాప భూదేవి వద్ద ఉందని, అర్ధరాత్రి పూజలు చేస్తే తిరిగి వస్తుందని హంగామా సృష్టించాడు. చిన్నారిది కారణజన్మ అని, ఏ అడవి జంతువులు ఎత్తుకుపోలేదని, రాత్రి ఒంటి గంటకు కచ్చితంగా తోటలో ప్రత్యక్షమవుతుందని చెప్పాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తేనే పాప వస్తుందంటూ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాడు.



