← Back to news

జాతీయ ఆరోగ్య లక్ష్యాలు సాధించాలి: డాక్టర్ పవిత్ర

By Srikanth Goud· 1h ago· Ramagundam, Ramagundam, Peddapalli
జాతీయ ఆరోగ్య లక్ష్యాలు సాధించాలి: డాక్టర్ పవిత్ర

TG: పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సిబ్బంది సమన్వయంతో పనిచేసి సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, సమయపాలన లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా తదితర వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించాలని ఆదేశించారు. గర్భిణీలు, పిల్లలకు సకాలంలో వైద్య సేవలు, టీకాలు అందించాలని, అర్హులైన బాలికలకు HPV వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు.

More in Local