హైదరాబాద్‌లో భారీ వర్షం

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లంగర్‌హౌస్, పంజాగుట్ట, అమీర్‌పేట, SR నగర్, మణికొండ, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు ఏపీలో కూడా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షం కురుస్తోంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడలో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రానికి దగ్గర్లో అల్పపీడనం ఉంది. అది సెప్టెంబర్ 23 నాటికి వాయుగుండంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.



