← Back to news

సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి

By Kamal Kumar· 1d ago
సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలి

TG: వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌ గ్రామంలోని ఎస్సీ వార్డులో మౌలిక వసతుల కొరతపై కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు కర్నె వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో సరైన రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు మురుగు కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.