మహిళను వేధించిన SIకి షాక్

TG: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని వేధింపులకు పాల్పడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట SI కదిరే శ్రీకాంత్‌ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు 4నెలలుగా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సిమ్‌కార్డులు ధ్వంసం చేసి వైఫై ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, 14రోజుల రిమాండ్ విధించింది.



