పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

TG: రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, సోదరభావాన్ని చాటుతూ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జూపాక మమత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, సర్పంచ్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రాఖీలు కట్టి వేడుకల్లో భాగస్వాములయ్యారు.

