← Back to news

భారత్‌ నుంచి ఫస్ట్‌ 100% దేశీ AK-203 ‘Sher’ రెడీ

By Mahesh· 26 Aug 2026
భారత్‌ నుంచి ఫస్ట్‌ 100% దేశీ AK-203 ‘Sher’ రెడీ

భారత్‌ డిఫెన్స్‌ రంగంలో మరో బిగ్‌ అచీవ్‌మెంట్‌ సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ఫ్యాక్టరీలో 100% భారతీయ భాగాలు, ముడి పదార్థాలతో తయారు చేసిన AK-203 ‘Sher’ రైఫిల్‌ను తొలిసారి టెస్ట్‌ ఫైర్‌ చేశారు. ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన ఈ రైఫిల్‌ తొలి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్‌లో ఇండియన్ ఆర్మీ ట్రయల్స్‌ నిర్వహించనుంది. దీంతో డిఫెన్స్‌ తయారీలో ‘Make in India’కు మరింత బూస్ట్‌ లభించనుంది. ఇది పూర్తిగా స్వదేశీ తయారీ దశకు భారత్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.