గుంత పూడ్చేందుకు వెళ్లి.. మరో గుంతలో చిక్కుకున్న ట్రక్!
మహారాష్ట్ర నాసిక్‌లో రోడ్ల పరిస్థితులపై ఆందోళన కలిగించే ఘటన జరిగింది. గంగాపూర్ రోడ్‌లో గుంతలు పూడ్చేందుకు కంకర తీసుకెళ్తున్న ట్రక్, రోడ్డు కుంగిపోవడంతో గుంతలో చిక్కుకుంది. ట్రక్ స్టార్మ్‌వాటర్ డ్రైనేజ్ లైన్ కోసం తవ్విన స్థలం దగ్గరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ఒక్కసారిగా కుంగడంతో ట్రక్ వెనక్కి జారిపోయింది. దాని ముందు చక్రాలు గాల్లో వేలాడుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ పనితీరుపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూన్నారు.



