నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం
AP: నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమ కోర్కెలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ వివిధ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ప్రసిద్ధ స్వర్ణాల చెరువు ఘాట్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. AP ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదురోజుల పాటు వివిధ రకాల సంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి. పండుగ ప్రారంభమైన తొలిరోజే దాదాపు 3లక్షల మంది భక్తులు దర్గాను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.



