← Back to news

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

By Buditi Sangeetarao· 26 Aug 2026· East Godavari
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

AP: కార్మికుల సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయడంతో పాటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమలు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ పోర్టల్ సక్రమంగా పనిచేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లేబర్ కార్డుల జారీ, రెన్యువల్స్ నిలిచిపోయాయని తెలిపారు.

More in Local