← Back to news

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా

By GANDHAM PRAVEEN KUMAR· 2d ago

TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఖానాపూర్ ఇన్‌చార్జ్ బుక్య జాన్షన్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జాన్షన్ నాయక్ మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ధర్నా

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.