← Back to news

బతుకమ్మ పాటలతో మార్మోగిన చిల్లేపల్లి

By Bala· 1d ago
బతుకమ్మ పాటలతో మార్మోగిన చిల్లేపల్లి

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజైన 'సద్దుల బతుకమ్మ'కు పల్లెలు, పట్టణాలు సిద్ధమయ్యాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు, చిన్నాపెద్దా తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

More in Local