← Back to news

అగరబత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

By DK· 25 Jul 2026· కర్నూలు జిల్లా
అగరబత్తి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

AP: కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్‌ దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్లుకు కూడా వ్యాపించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు. కళ్లముందే ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి కావడంతో యజమాని కన్నీరుమున్నీరుగా విలపించారు.

More in AP