ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు ప్రారంభం

TG: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధివిధానాలు, అర్హతలు, మార్గదర్శకాలను సచివాలయంలో క్యూర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన ప్రకటించారు. తొలి విడతగా ఇప్పటికే స్థలాలు గుర్తించిన 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఇళ్ల కోసం దరఖాస్తులను ఈ నెల 21 నుంచి ఆగస్టు 10 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.



