శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస బాలాజీ కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నార్త్ జోన్ పరిధిలో అక్రమ సారా తయారీ, విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకేచోట గుమికూడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
