← Back to news

వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ

By Rajuu Ulidra· 21 Aug 2026
వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ

AP: వీబీజీ రాంజీ పథకం వల్ల ఉపాధి కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ కర్నూలు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్, రైతు సంఘం నాయకుడు ఆంజనేయ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు.

More in Local