← Back to news

PF, ESI డబ్బులు వెంటనే జమచేయాలి: CITU

By Mogili Mudhiraj· 19 Aug 2026· వనపర్తి జిల్లా
PF, ESI డబ్బులు వెంటనే జమచేయాలి: CITU

TG: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ కార్మికుల పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో కార్మికుల పీఎఫ్‌ డబ్బులు ఖాతాల్లో జమ చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ నూరాల్‌ నజీబ్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.ఎన్‌. రమేష్ మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు.

More in Local