ఏడేళ్ల బాలుడి మృతి.. పోషకాహారం లేకే అంటున్న కుటుంబం

మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా కార్కేలి బ్లాక్‌లోని నర్వార్-25 గ్రామానికి చెందిన సనమ్ బైకా(7) పోషకాహార లోపంతో మరణించాడు. అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాలుడి కుటుంబం ఆరోపించింది సనమ్ చాలా బలహీనంగా ఉండేవాడని, నడవడం కూడా కష్టమని తండ్రి అమృత్‌లాల్ చెప్పారు. ‘అంగన్‌వాడీ నుంచి గానీ, ఆరోగ్య శాఖ నుంచి గానీ ఎవరూ రాలేదు. మంచి తిండి కూడా దొరకలేదు’ అని బాలుడి తల్లి వివరించారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేస్తున్నారు.


