← Back to news

మా కాలేజీకి 3 రోజులేనా? 6 రోజుల రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి!

By .· 1d ago
మా కాలేజీకి 3 రోజులేనా? 6 రోజుల రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి!

నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూపు స్టూడెంట్స్‌కు బోటనీ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా మారింది. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నా.. వారానికి 3 రోజులు మాత్రమే తాత్కాలిక లెక్చరర్ రావడంతో చదువు నిలిచిపోయే పరిస్థితి. అధికారులు చేసిన ఈ తాత్కాలిక ఏర్పాటు సరిపోదని డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం చెబుతోంది. పూర్తిస్థాయి రెగ్యులర్ బోటనీ ఫ్యాకల్టీ కేటాయించాలని, వారంలో 6 రోజుల పాటు క్లాసులు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.