← Back to news

బీఆర్ఎస్ ధర్నా.. రైతులకు 24x7 కరెంట్ కావాలి!

By Bhasker· 1d ago
బీఆర్ఎస్ ధర్నా.. రైతులకు 24x7 కరెంట్ కావాలి!

నాగర్కర్నూల్ జిల్లా తాడూరులో రైతుల సమస్యల పరిష్కారం కోసం BRS నాయకులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కరెంట్ కట్స్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సాగు సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.