← Back to news

'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందా గుట్టురట్టు

By Vishi· 14 Aug 2026· Delhi
'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందా గుట్టురట్టు

చైనాతో లింకులున్న 'వర్క్ ఫ్రమ్ హోమ్' సైబర్ దందాను డిల్లీ పోలీసులు క్రాక్ చేశారు. జాబ్స్ పేరుతో రూ. 12 లక్షలు కాజేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలు పెంచుకున్న యువకులు మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా డబ్బును 'USDT' క్రిప్టోకరెన్సీ రూపంలోకి మారుస్తున్నట్టు గుర్తించారు. ఈ డబ్బును చైనాకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు తెలుసుకున్నారు. గురుగ్రామ్, గాజియాబాద్, నోయిడా, ఇటావాలో దాడులు చేసి వాళ్లను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 5h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.