ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

TG: ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ వేంసూరు మండల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా అడసర్లపాడు కాంప్లెక్స్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. రెండో వేతన సవరణ సంఘం అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు కోరారు.



