← Back to news

ఇక MPDOవో ఆఫీస్‌లోనే ప్రజావాణి

By dk· 15 Aug 2026· ఖమ్మం జిల్లా
ఇక MPDOవో ఆఫీస్‌లోనే ప్రజావాణి

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఖమ్మం జిల్లా సింగరేణి మండల MPDO కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు MPDO బానోత్ పద్మ తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

More in Local